పోలీసులకి సీఎం కానుక
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులు, స్వచ్ఛ కార్మికులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి కానుక అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైద్యులు, స్వచ్ఛ కార్మికులకి సీఎం కానుక అందింది. తాజాగా పోలీసులకి కూడా సీఎం కానుక అందనుంది.
ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షత తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలీసులకి ఏప్రిల్ నెలకిగానూ పూర్తి జీతం ఇవ్వడంతో పాటు.. 10శాతం బోనస్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక విద్యుత్ కార్మికులకి పూర్తి జీతం ఇస్తామని చెప్పారు. ఇక మిగిలిన ఉద్యోగులకి గత నెల మాదిరిగానే 50శాతం జీతం మాత్రమే ఇస్తామని తెలిపారు.