భర్తతో విడాకుల వార్త చెప్పిన కలర్ స్వాతీ
కలర్ స్వాతీ భర్త వికాస్ తో విడాకాలు తీసుకునేందుకు రెడీ అయిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి కారణం ఇటీవల కలర్ స్వాతీ భర్తతో కలిసి ఉన్న ఫోటోలని సోషల్ మీడియా నుంచి తొలగించింది. దీంతో కలర్ స్వాతీ వ్యతిగత జీవితంలో సమస్యలు మొదలైనట్టున్నాయి. ఆమె భర్తకి విడాకులు ఇవ్వబోతున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై కలర్ స్వాతి స్పందించారు. తన ఇన్ స్టా గ్రామ్ లో కలర్ స్వాతీ హరీ పోటర్‌లోని డైలాగ్‌ను పోస్ట్ చేసింది. భర్తతో కలిసి దిగిన ఫోటలన్నింటిని దాచుకున్నట్టు తెలిపింది. దీంతో భర్తతో విడాకుల వార్తకి కలర్ స్వాతి చెక్ పెట్టేసింది. అన్నట్టు కలర్ స్వాతీ-వికాస్ లది ప్రేమ వివాహం. పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరి వివాహం జరిగింది. ఇక తెలుగు, తమిళ్ లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్ స్వాతీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.