మే 7 వరకు లాక్ డౌన్ పొడగింపు

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని మించిన జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశం మొత్తం జనతా కర్ఫ్యూ 24గంటల పాటు పాటిస్తే.. తెలంగాణ ప్రజలు మాత్రం 48గంటల పాటు పాటించారు. ఇక కేంద్రం తొలి విడతగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 15  లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించింది.

ఇక ఏప్రిల్ 14 తర్వాత దేశంలో లాక్ డౌన్ పొడగిస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 3 వరకు లాక్ డౌన్  ని పొడగించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా లాక్ డౌన్  ని మే 7 వరకు పొడగించబోతున్నట్టు సమాచారమ్. అంతేకాదు.. రేపటి (ఏప్రిల్ 20) నుంచి లాక్ డౌన్ నుంచి కేంద్రం ఇచ్చిన మినహాయింపులని కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయాలపై ప్రస్తుతం తెలంగాణ కేబినేట్ సుదీర్ఘంగా చర్చిస్తోంది. గత 4గంటల నుంచి సమావేశం కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో సీఎం కెసీఆర్ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలని మీడియాకు వివరించనున్నారు.