తెలంగాణలో లాక్ డౌన్ సడలింపుల్లేవ్ : కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నిర్ణయాన్ని పాటించడం లేదు. మే 3 వరకు లాక్ డౌన్ ని పొడగించిన కేంద్ర ప్రభుత్వం రేపటి (ఏప్రిల్ 20) మాత్రం కొన్ని రంగాలకి మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపింది. అయితే ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం.. లాక్ డౌన్ సడలింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వొదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధివిధానాలే కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. 186మంది కరోనా నుంచి కోలుకున్నారు. డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 651 చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోనే నాలుగు జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కావాలని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతేకాదు.. లాక్ డౌన్ పొడగింపు విషయంలో సర్వే చేశామని.. స్వయంగా తానే చాలామందితో మాట్లాడనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ని మే 7 వరకు పొడగిస్తున్నట్టు తెలిపారు.