స్విగ్గీ, జొమాటా.. బ్యాన్ !
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ని మే 7వరకు పొడగించింది. దాంతోపాటు ఫుడ్ డెలవరీ సర్వీసులని బ్యాన్ చేసింది. స్విగ్గీ, జొమాటాలని తెలంగాణలో రేపటి నుంచి బ్యాన్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. వీటికి బ్యాన్ గల కారణాలని సీఎం కేసీఆర్ ఓ ఉదాహరణతో వివరించారు. ఇటీవల ఢిల్లీ పిజ్జా నుంచి 69మందికి కరోనా సోకిందని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ఎవరు పిజ్జా జోలికి వెళ్లకండి. అసలు బయటి ఆహారమే తీసుకోవద్దు. అవసరమైతే.. కిరాణ షాపులకి వెళ్లి సరుకులు తెచ్చుకొని వంట చేసుకొని తినాలని సూచించారు. ప్రస్తుతం సమయంలో బయటికి ఆహారం మంచిది కాదని తెలిపారు. ప్రాణాల కంటే ఎక్కువ ఏది కాదు. దయచేసి.. లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.