పూరి మార్క్ పడాల్సిందే !

పూరి జగన్నాథ్.. హీరోయిజానికి కెరాఫ్ అడ్రస్. ఆయనలా ఆయన హీరోలు అదరరు. బెదరరు. దూసుకెళ్తారంతే. దాదాపు టాలీవుడ్ స్టార్  హీరోలందరితోనూ పూరి సినిమాలు చేశారు. ఆ స్టార్స్ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. పూరితో సినిమా వారికి ప్రత్యేకం. పవన్ ‘బద్రీ’ని మరిచిపోగలమా ? నువ్ నందా అయితే.. ఏంటీ ? నేను బద్రి.. బద్రీనాథ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్ ని మరిచిపోగలమా ?

పూరి పేరు చెప్పకుండా రవితేజని గుర్తించగలమా ? రవితేజ ఎన్ని సినిమాలు చేసిన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి.. సినిమాలని మరచిపోగలడా ? మహేష్ ని స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘పోకిరి’. మహేష్ ఇంకో వంద సినిమాలు చేసినా.. పోకిరిని మరచిపోగలమా ?. బాహుబలి ప్రభాస్ కు ‘బుజ్జిగాడు’ అంటే భలే ఇష్టం. ఆయన అభిమానులకి అంతే. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ని ‘దేశముదురు’ని చేసిన ఘనత పూరిది.

‘ఇస్మార్ట్ శంకర్’రామ్ ని మరచిపోగలమా ? ఇలా స్టార్స్ కి కిక్కునిచ్చిన దర్శకుడు పూరి. అందుకే.. యంగ్ హీరోలైనా, స్టార్ హీరోలైనా పూరి మార్క్ పడాల్సిందేనని ప్రేక్షకులు కోరుకుంటారు. నేటితో దర్శకుడిగా పూరి 20యేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయన తొలి సినిమా ‘బద్రీ’కి విడుదలై 20యేళ్లు గడిచాయ్. అయినా.. పూరిలో అదే పవర్. ఆ పవర్ తగ్గొదని.. ఇంకో వంద సినిమాలు తీయాలని.. అలరించాలని కోరుకుంటోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.