సీఎం జగన్ రంజాన్ రిక్వెస్ట్
కరోనా ప్రభావంతో పండగలని పండగలా జరుపుకోలేని పరిస్థితి. ఈ మహమ్మారి కారణంగా ఈ సారి ఉగాధి, శ్రీరామ నవవి పండగలని జరుపుకోలేకపోయాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగలని ఇంట్లోనే జరుపుకున్నాం. ఇప్పుడు రంజాన్ వస్తోంది. ఈ పండగని ముస్లిం సోదరులు ఇంట్లోనే జరుపుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ సోమవారం జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్లల్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలేనన్నారు. కరోనా వైరస్ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో రంజాన్ ని ఇంట్లోనే జరుపుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఇది కష్టమైన మాట. కానీ చెప్పక తప్పడం లేదని సీఎం జగన్.