కరోనాని అంతం చేసేందుకు కొత్త దేవత వెలిసింది !

భారతీయ సాంప్రదాయం భిన్నం. మనం టెక్నాలజీ కంటే దైవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇక తెలంగాణలో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలంగాణకే సొంతమైన బతుకమ్మ, బోనాలు పండగలున్నాయి. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ ని అంతమొందించడం కోసం కొత్త దేవత వెలిసింది.

వరంగల్ జిల్లాలో బానోతు కవిత అనే మహిళకు దుర్గమ్మ ఆవహించింది. మన ధరణికి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తా. కానీ నేను చెప్పినట్టు చేయాలె అంటోంది. ఇంతకీ ఏం చేయాలంటే ? తాను నిల్చుకున్న చోటే తనకి గుడి కట్టాలి. నిత్యం పూజాలు చేయాలని కోరింది. అందుకు ఆ గ్రామ ప్రజలు, చుట్టు ప్రక్కల గ్రామాల వారు ఓకే చెప్పారు. కానీ, ఆ భూమి యజమాని మాత్రం ఓ 2 గుంటల భూమి ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. అయితే ఈ లోపు వరంగల్ జిల్లాల నుంచి చాలామంది ప్రజలు వచ్చి.. దుర్గమ్మ ఆవహించిన కవిత దర్శనం చేసుకొని వెళ్తున్నారు.