రజనీ సినిమాలో విలన్ పాత్రపై గోపీచంద్ ఏమన్నారంటే ?

విలన్, హీరో.. ఈ రెండు పాత్రలు గోపీచంద్ కి కొట్టిన పిండే. అయితే గోపీచంద్ ని విలన్ గా చూడాలనుకునే అభిమానులు ఎక్కువే. ఎందుకంటే ? జయం, నిజం, వర్షం సినిమాల్లో గోపీచంద్ విలనీజంని మర్చిపోలేం. హీరోగా కూడా ఆయన విజయాలు అందుకున్నారు. అయితే ఏ క్షణంలోనైనా గోపీ విలన్ గా టర్న్ తీసుకుంటాడనేది ప్రేక్షకుల గట్టి నమ్మకం.
 
ఈ నేపథ్యంలోనే శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా కోసం గోపీచంద్ ని విలన్ గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. ? గోపీచంద్-శివ మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబోలో శౌర్యం, శంఖం సినిమాలొచ్చాయ్. అయితే తాజాగా రజనీ సినిమాలో విలన్ పాత్రలో గోపీ క్లారిటీ ఇచ్చారు.  

“నేను విలన్‌గా నటిస్తున్నాని వస్తున్న వార్తలు అవాస్తవం. కరోనా టైమ్‌లో ఇలాంటి రూమర్లు వినాల్సి వస్తోంది. నేను విలన్‌గా ఏ సినిమాలో నటించడం లేదు. ‘అన్నాత్తే’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శివ నాకు మంచి స్నేహితుడు కావడం వలన ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. నేను ఏ సినిమాలోను విలన్‌గా చేయడం లేదు” అని గోపిచంద్ క్లారిటీ ఇచ్చారు.