మహేష్ కు స్పెషల్ డే.. స్పెషల్ ట్విట్ !
ఏప్రిల్ 20 – సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మహేష్ అమ్మగారు ఇందిరా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ ట్విట్టర్ వేదికగా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “ఏప్రిల్ 20 చాలా ప్రత్యేకమైన రోజు. నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. మా అమ్మ పుట్టిరోజు. హ్యాపీ బర్త్ డే అమ్మ’ అని రాసుకొచ్చారు మహేష్.
సూపర్ స్టార్ కృష్ణ మేనమామ కూతురు ఇందిరా. కృష్ణ హీరోల నిలదొక్కుకుంటున్న సమయంలోనే వీరి పెళ్లి జరిగింది. గూఢాచారి 116 హిట్ అయిన తర్వాత కృష్ణకి వరుసగా సినిమా ఆఫర్లొచ్చాయ్. ఈ క్రమంలో కృష్ణ-విజయ నిర్మల కాంబోలో వరుసగా సినిమాలొచ్చాయి. ఈ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారింది. ఈ విషయంలో కృష్ణ భార్య ఇందిరాతో పాటుగా కుటుం సభ్యులందరికీ చెప్పేశాడు. విజయనిర్మలని రహస్యంగా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు.
విజయ నిర్మలని పెళ్లి చేసుకున్న ఇందిరని నిర్లక్ష్యం చేయలేదు కృష్ణ. కృష్ణ-ఇందిరలకి మొత్తం ఐదుగురు సంతానం. వీరిలో మహేష్ బాబు చిన్నవాడు. అమ్మ అంటే మహేష్ కి చాలా ఇష్టం. ఆ విషయాన్ని పలు సందర్భాల్లో మహేష్ పంచుకున్నారు. ఏమాత్రం సమయం దొరికినా.. ఇద్దరు పిల్లలతో అమ్మ దగ్గరికి వెళ్తుంటాడు మహేష్. ఇవాళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా మహేష్ స్పెషల్ ట్విట్ చేశారు. స్పెషల్ విషెస్ చెప్పారు. టీఎస్ మిర్చి తరుపుతున కూడా ఇందిరా గారికి జన్మదిన శుభాకాంక్షలు.