టాస్క్ పూర్తి చేసిన రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి టాస్క్ ని పూర్తి చేశాడు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా రాజమౌళి #BetheREALMAN ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన మగవారు మహిళలకి సాయం చేయాలి. ఇంటి పనులు చేయాలి. నిజమైన మనిషి అనిపించుకోవాలని సందీప్ జక్కన్నకి ఛాలెంజ్ విసిరాడు.

ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన రాజమౌళి సోమవారం దానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తానన్నారు చెప్పినట్టుగా రాజమౌళి #BetheREALMAN ఛాలెంజ్ ని పూర్తి చేశాడు. వీడియోని షేర్ చేశారు. ఈ ఛాలెంజ్ ని జక్కన్నఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు దర్శకుడు సుకుమార్, శోభు యార్లగడ్డ, కీరవాణీలకి విసిరారు.

ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా పాన్ ఇండియా సినిమాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. వచ్చే యేడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.