సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు పితృ వియోగం
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ కన్నుమూశారు. ఆయన కొద్దిరోజులుగా కిడ్నీ, కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. మార్చి 13న ఆనంద్ సింగ్ బిష్ట్ ని ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరోగ్యం విషమించి.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమకేశ్వర్‌లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. 1991లో ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రేంజర్‌గా ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి ఆయన స్వగ్రామంలోనే నివసిస్తున్నారు.