కరోనా వైరస్.. మరో షాకింగ్ న్యూస్ !

విదేశాల నుంచి వచ్చిన వారితో లేక కరోనా సోకిన వ్యక్తిని కలవడం, తిరగడం వలన కరోనా వస్తుందని చెబుతున్నారు. అందుకే సామాజిక దూరం, లాక్‌డౌన్ ని పాటిస్తున్నాయి. అయితే ఎక్కడికి వెళ్లకున్నా.. ఎవరిని కలవకుండా ఇంట్లో ఉన్నా కరోనా వస్తుందనే ఘటనలు బయటపడటం ఆందోళన కలిగిస్తున్నాయి.

హైదరాబాద్ కి చెందిన ఓ వ్య‌క్తి గ‌త కొంత‌కాలంగా పక్షవాతంతో మంచానికే పరిమిత‌మ‌య్యాడు. దీంతో అత‌డు రెండు నెలలుగా కాలు కూడా బయటపెట్ట‌లేదు. అయిన‌ప్ప‌టికీ అత‌డికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. విచిత్రమేంటంటే.. ? అతడి కుటుంబ సభ్యులకి ఎవరికి కరోనా సోకలేదు.

ఇలాంటిదే మరో కేసు… యాకుత్‌పురాకి  చెందిన 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రికి వెళ్లాడు. వైద్యులు అత‌డికి అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించి కోవిడ్ ల‌క్ష‌ణాలున్న‌ట్లు గుర్తించారు. కానీ, ఆ వృద్ధుడికి సంబంధించి ఆయ‌న‌ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇటీవల విదేశాల నుంచి రాకపోకలు సాగించలేదు. ఆ కుటుంబంలో మరెవ్వరికి కరోనా లక్షణాలు బయటపడలేదు. ఇలాంటి సంఘటనలు ప్రజలని మరింత ఆందోళనకి గురి చేస్తున్నాయి.