గాలిలో కరోనా వైరస్ ఎంత దూరం వ్యాపిస్తుందంటే ?

ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ గాలిలోనూ వ్యాపిస్తున్న న్యూస్ ఆందోళన కలిగిస్తోంది. కానీ ఇది నిజం. కరోనా వ్యాప్తించిన వ్యక్తి నుంచి 1.5 మీటర్ల వరకు వైరస్ ప్రయాణిస్తుంది. అదే వ్యక్తి దగ్గినప్పుడు 2మీటర్లు, తుమ్మినప్పుడు ఏకంగా 8 మీటర్ల దూరం వరకు వైరస్ ప్రయాణిస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

అందుకే ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరింది. కరోనా నుంచి తప్పించుకోవడానికి దాదాపు 8 అడుగుపైగా సామాజిక దూరం పాటిస్తే మంచిది. అప్పుడు కరోనాని మన దరికి చేరకుండా జాగ్రత్తపడొచ్చు. దాంతో పాటు శుభ్రతని పాటించడం.. మంచి ఆహారాన్ని తీసుకోవడం మంచింది.