ఈ ఐదు నగరాలు వెరీ.. డేంజర్ !

దేశంలో కరోనా కంట్రోల్ లోకి రావడం లేదు. పైగా ఇంకా విజృంభిస్తోంది. కొన్ని నగరాల్లో విశ్వరూపం చూపిస్తోంది. ముంబై, పూణె, కోల్ కతా, జైపూర్, ఇండోర్ నగరాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు నగరాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. నాలుగు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ నగరాలకు ఆరు అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను మూడు రోజుల్లో పంపించనున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరుగుతుండడం, భౌతిక దూరం నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేయడం, కొన్నిచోట్ల పట్టణ ప్రాంతాల్లో సిటీ బస్సులు తిరిగేస్తుండడంపై, అటు కేరళలో కొన్ని నిబంధనల్ని సరళతరం చేయడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ఆక్షేపణ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రెస్టారెంట్లు, సిటీ బస్సులకి సడలింపుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.