ఐపీఎల్ రద్దయితే.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ?

కరోనా ప్రభావంతో క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయ్. బీసీసీఐకి కూడా ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేసింది. 2020 ఐపీఎల్ జరగడం అనుమానంగానే ఉంది. ఒకవేళ టోర్నీ రద్దయితే బీసీసీఐ, ఫ్రాంఛైజీలకు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఒకవేళ టోర్నీలు రద్దయితే.. భీమా ఉంటుంది కదా.. ! అంటే కరోనాకి భీమా లేదు.

భీమా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తమ కవరేజీ క్లాజ్ నుంచి కరోనా మహమ్మారిని తొలగించింది. బీసీసీఐతో పాటు అనేక ఫ్రాంఛైజీలకు బీమా సౌకర్యం ఉంది. ఆ ఫ్రాంఛైజీలు కూడా ఫిబ్రవరి-మార్చి నాటికి గానీ తమ బీమా కంపెనీలను సంప్రదించడం మొదలు పెట్టలేదు. అప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా వైరస్ ను మహమ్మారిగా ప్రకటించింది. దాంతో బీమా కంపెనీలు నిబంధనలు మార్చాయి.