రంజాన్ మాసంలో మసీదులన్నీ మూసివేత

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పండగలని పండగలా జరుపులోలేని పరిస్థితి. రంజాన్ పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. సౌదీ అరేబియాలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రంజాన్ మాసంలోనూ ముందుజాగ్రత్త చర్యగా మక్కా నగరంలోని అల్ హరం. అల్ నబవీ మసీదులను మూసివేస్తూ ఆ దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

రంజాన్ ఉపవాసాల సందర్భంగా ప్రపంచంవ్యాప్తంగా లక్షలాది మంది హజ్ యాత్రకు వచ్చిన భక్తులు ఈ మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. రంజాన్ సందర్భంగా ముస్లిములు ఉపవాసాలు ఉండటంతోపాటు తరావీ నమాజులు చేస్తుంటారు. తరావీ నమాజులతో పాటు రంజాన్ ఈద్ నమాజ్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని సౌదీ అరేబియా మసీదుల ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్ ట్విట్ చేశారు. 

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ పండగని ఇళ్లలోనే చేసుకోవాలని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ విజ్జప్తికి ఓకే చెప్పారు. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.