కేసీఆర్, కేటీఆర్.. ద్వేశించినోళ్లే ప్రేమిస్తున్నారు !

టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడి.. సాధించిన పార్టీ. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసే సమయంలో కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేసే వారు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రావాళ్లు కేసీఆర్ ని ద్వేశించేవారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి మారింది. చాలా మంది ఏపీ ప్రజలు సీఎం కేసీఆర్, ఆయన తనయుడు , మంత్రి కేటీఆర్ కి వీరాభిమానులుగా మారారు.

తాజాగా ఓ నెటిజన్ తాను గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను ద్వేషించేవాడిని. ప్రస్తుతం వారి అభిమానిగా మారానని ట్విట్ చేశారు. ‘నేను తెలంగాణకు చెందిన వాడిని కాదు. తొలుత మిమ్మల్ని, మీ నాన్నను ద్వేషించాను. మీ పాలన చూసి అభిమానిగా మారాను. తెలంగాణే కాదు దేశం మొత్తం మీ నాయకత్వాన్ని పొందుతుందని నేను విశ్వసిస్తున్నా’నన్నారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. మీలో వచ్చిన పరివర్తనకు అభినందనలు. మీ హృదయంలో ద్వేషం స్థానంలో అభిమానం చోటుచేసుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.