పవన్’తో సినిమా తేల్చేసిన రాజమౌళి

‘దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తే బాగుంటుంది.’ చాన్నాళ్లుగా వినిపిస్తున్న మాట ఇది. ఇటీవల పవన్ రీ ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ చర్చ ఎక్కువైంది.  తాజాగా దీనిపై రాజమౌళి స్పందించారు. గతంలో పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశాను. కానీ కుదరదు. ఇప్పుడు మాత్రం పవన్ తో నాకు కుదరదని రాజమౌళి తేల్చేశారు.

ఎందుకంటే.. ? పవన్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయనకి సినిమా మాత్రమే ముఖ్యం కాదు. రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి ఎక్కువ సమయం కేటాయించలేరు. తాను మాత్రం చాలా నెమ్మదిగా సినిమా చేస్తాను. ఈ నేపథ్యంలో పవన్ తో నాకు సెట్ కాదని జక్కన్న వివరణ ఇచ్చారు. చిరంజీవి-పవన్ కాంబోలో సినిమా చేస్తే బాగుంటుంది. కానీ అది కుదురుతుందేమో చూడాలి అన్నారు.