ఇళ్లు తుడిచి, చెట్లకి నీళ్లుపోసి.. భార్యకి కాఫీ కలిపిచ్చిన చరణ్ 

టాలీవుడ్ లో #BetheREALMAN ఛాలెంజ్ ట్రెండ్ గా మారింది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఈ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మగవారు ఇంటి పనులు చేయండి. మహిళలకి సాయం చేయండి. మంచి మనిషి అనిపించుకోవాలని కోరుతూ #BetheREALMAN పేరిట దర్శకధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరారు సందీప్. ఇప్పుడీ ఛాలెంజ్ టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది.

ఇప్పటికే రాజమౌళి, తారక్ ఇంటిపనులు చేశారు. దానికి సంబంధించిన వీడియోలని షేర్ చేశారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా  ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. ఇళ్లు తుడిచి, చెట్లకి నీళ్లు పోసిన చరణ్.. కాఫీ కలిపి భార్యకి అందించారు. ఇప్పుడీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్ ఈ ఛాలెంజ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, దర్శకుడు త్రివిక్రమ్, రానా, శర్వానంద్ లని నామినేట్ చేశారు.