వర్షిణి.. హైపర్‌ ఆదితో ప్రేమలో ఉన్నారా.. ? 

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ తారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయంలో సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. తాజాగా యాంకర్ వర్షిణి ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరదాగా సమాధానం చెప్పారు.

‘నాకో డౌట్‌.. మీరూ, హైపర్‌ ఆది ప్రేమలో ఉన్నారా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘ఏమో. అలా ఏం లేదు. హైపర్‌ ఆది నాకు మంచి స్నేహితుడు’ అని సమాధానం ఇచ్చింది. ఇక సుడిగాలి సుధీర్ గురించి అడిగిన ప్రశ్నకి ‘మీ అందరికీ తెలుసు.. సుధీర్‌ నా కుటుంబ సభ్యుడు లాంటివాడు అని చెప్పుకొచ్చింది.