పోలీసులపై అల్లరి నరేష్ ఎమోషనల్ వీడియో

సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించే అల్లరి నరేష్.. ఎమోషనల్ అయ్యాడు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకి సెల్యూట్ చేస్తూ ఓ వీడియా విడుదల చేశారు. ఇందులో కంటెంట్ ఎమోషనల్ ఉంది. సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలెట్టిన అల్లరోడు.. పోలీస్ ల త్యాగాలని, వారి కష్టాలని ప్రస్తావించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ చిన్నపాటి ఎమోషనల్ సినిమాని చూపించాడు.

‘అవసరం కల్పించుకొని మనం బయట తిరుగుతున్నాం. అత్యవసర పరిస్థితుల్లో గాంధీ ఆసుపత్రి, రెడ్ జోన్, క్వారైంట్స్ దగ్గర ప్రాణాలని సైతం లెక్క చేయకుండా డ్యూటీలు చేస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు విత్ అవుట్ రెస్ట్ 24 గంటలు కష్టపడుతూనే ఉన్నారు. మన కోసం ఇంత చేస్తున్న మన పోలీసులకి మనం ఏం చేద్దాం సెల్యూట్’ అంటూ.. సాగింది అల్లరోడి వీడియో.