బన్నీతో ప్రేమలో యంగ్ హీరోయిన్ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ కొత్త విషయం తెలిసిందే. ఆయనతో ఓ యంగ్ హీరోయిన్ ప్రేమలో పడిందట.  వీరిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారట. బన్నీకి పెళ్లయిన తర్వాత ఈ విషయం బయటపడింది. కానీ రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో జరగబోతుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ‘పుష్ప’ రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక మందన నటించనున్నారు. సినిమాలో మొదటి నుంచే వీరిద్దరు భార్యభర్తలుగా కనిపిస్తారట. అయితే అంతకంటే ముందే బన్నీకి లవ్వర్ ఉంటుందట. ఆ పాత్ర కోసం యంగ్ హీరోయిన్ నివేదా థామస్ ని తీసుకున్నారని సమాచారమ్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప ఉండనుంది. బన్నీ బర్త్ డే కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్ లో ఆయన ఊరమాస్ లుక్ లో కనిపించారు. కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.