దారుణం : పోలీసులపై రాళ్లదాడి
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన తమ ప్రాణాలని పనంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. అలాంటి పోలీసులపై రాళ్లదాడి జరిగిన ఘటన ఉత్తరప్రదేష్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై రాళ్ళ దాడి జరిగింది.
ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డాడు. అలీగఢ్ లోని భుజ్‌పురాలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మార్కెట్ తెరవడానికి అనుమతి ఇచ్చారు. సమయం ముగియగానే పోలీసులు దుకాణాలను మూసివేయమని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు, దుకాణదారుల మధ్య గొడవ జరిగింది. అక్కడున్న అల్లరి మూకలు పోలీసులపై రాళ్ళు విసరడం ప్రారంభించారు.