వాట్సాప్‌’లో కొత్త ఫీచర్లు వస్తున్నాయ్

కరోనా లాక్‌ డౌన్ నేపథ్యంలో వాట్సాప్ వాడకం మరీ.. ఎకువైపోతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ టీమ్‌ కొత్త ఆప్షన్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అతి త్వరలోనే వాట్సాప్‌లో కొత్త ఫీచర్ల రాబోతున్నాయి. అవేంటంటే.. ? వాట్సాప్‌లో మీ ఛాట్‌ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు ఎన్‌క్రిప్ట్‌ రూపంలో మీ గూగుల్‌ డ్రైవ్‌లో బ్యాకప్‌ అవుతుంటాయి. అయితే దీనికి ఎలాంటి రక్షణ ఉండదు. ఇప్పుడు వాట్సాప్‌ బ్యాకప్‌కి కూడా రక్షణ కల్పించాలని నిర్ణయించుకుంది. 

వాట్సాప్‌లో గ్రూపులు, కాంటాక్ట్స్‌ ఎక్కువైపోయేసరికి పాత ఇమేజ్‌, పీడీఎఫ్‌, లింక్‌ కావాలంటే వెతకడం చాలా కష్టం. అందుకే వాట్సాప్‌ ఓ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. వాట్సాప్‌లో గ్రూప్‌ కాలింగ్‌ కొత్తేమీ కాదు. అయితే గ్రూప్‌ కాలింగ్‌లో గరిష్ఠంగా నలుగురికి మాత్రమే కాల్‌ చేయగలం. త్వరలో ఈ నెంబరు పెరగబోతోందట. 

ఒకే నెంబరుతో రెండు మొబైల్స్‌లో వాట్సాప్‌ వాడేలా మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్టును తీసుకురాబోతున్నారు. మొబైల్‌ అందుబాటులో లేకపోయినా వాట్సాప్‌ వెబ్‌ వాడేలా మార్పులు చేస్తున్నారట. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో సీక్రెట్‌ కన్వర్జేషన్‌ ఫీచర్‌ తెలుసు కదా. ఇప్పుడది వాట్సాప్‌లోకీ రాబోతోంది.

వాట్సాప్ లో నకిలీ వార్తల బెడదా తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాట్సాప్‌లో మనకూ రోజూ వార్తలు, వెబ్‌సైట్ల లింక్స్‌ వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్‌ చేస్తే వాట్సాప్‌ను వీడి.. వేరే బ్రౌజర్‌లో ఆ లింక్‌ ఓపెన్‌ అవుతుంది. త్వరలో అలా క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లోనే ఆ వెబ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ ఆప్షన్స్ త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నంలో వాట్సాప్ టీమ్ ఉంది.