శృంగార కోరిక తీరిస్తే.. ఇళ్లు ఉచితం !
ఒంటరి మహిళ కనబడితే.. కన్నేసి కోరిక తీర్చుకోవాలని కొందరు మగాళ్లు చూస్తుంటారు. అయితే లండన్ లో మాత్రం డైరెక్ట్ గా అడిగేస్తారట. అక్కడ ‘రెంట్ ఫర్ సెక్స్’ న్యూ ట్రెండ్ గా మారింది. ఎవరైనా యువతి లేదా మహిళ ఒంటరిగా ఉండి అలాంటి ఆమెకు ఇల్లు అద్దెకు కావల్సి వస్తే ఇంటిని రెంట్‌కు ఇస్తారు. కాకపోతే ఇంటి రెంట్‌ను ఇవ్వాల్సిన పనిలేదు. అందుకు బదులుగా ఇంటి యజమానితో శృంగారంలో పాల్గొనాలి.
తొలుత ఈ విధానం కేవలం లండన్ నగరంలో మాత్రమే కనపడేది. ఇప్పుడు యూకే మొత్తం పాకేసింది. అయితే ఇది చట్ట వ్యతిరేకమే. ఇలాంటి పనులు చేస్తే.. 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. అయితే ఇంటి యజమానుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. పరస్పరం అంగీకారంతో సెక్స్ చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ అంగీకారంతోనే శృంగారంలో పాల్గొంటున్నారని ఇంటి యజమానులు చెబుతున్నారు. ఈ ‘సెక్స్ ఫర్ రెంట్’ ఓ మీడియా సంస్థ చేసిన స్టీరింగ్ ఆపరేషన్ లో బయటపడింది.