జూన్ 1వరకు లాక్‌డౌన్ పొడగింపు 

ప్రపంచ దేశాలని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ ఎఫెక్ట్ తో అగ్రరాజ్యలు, అభివృద్ధి చెందిన దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం భారత్ లో ముందుగా 21 రోజుల పాటు (ఏప్రిల్14) వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దానికి మే 3 వరకు పొడగించారు. దీంతో భారత్ లో మొత్తం 40రోజుల పాటులాక్‌డౌన్ కొనసాగినట్టవుతోంది.

సింగపూర్ కూడా భారత్ తరహా లాక్‌డౌన్ ని రెండోసారి పొడగించింది. ముందుగా మే 4 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన ఆ దేశం ఇప్పుడు దానిని జూన్ 1 వరకు పొడిగించింది. సింగపూర్ జనభా 56 లక్షలు మాత్రమే. ఆ దేశంలో ఇప్పటి వరకు 9125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృతి చెందారు. ఇంత చిన్నిదేశం కరోనాని కంట్రోల్ చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే 135కోట్ల జనభా గల మనదేశంలో కరోనాని కంట్రోల్ చేయడంలో బెటర్ గా ఉందని చెప్పవచ్చు.