అప్పటి వరకు క్రికెట్ మ్యాచ్ లు ఉండవ్ : గంగూలీ
కరోనా ఎఫెక్ట్ తో అన్నీ క్రీడా టోర్నీలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ యేడాది ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ లని నిర్వహించాలనే చర్చ జరుగుతోంది. జర్మనీలో మేజర్ ఫుట్బాల్ టోర్నీ బుందేస్లిగాను మే తొలి వారం నుంచి ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు.
తాజాగా దీనిపై బీసీసీ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. “భారత్, జర్మనీల సామాజిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. సమీప భవిష్యత్తులో భారత్లో క్రికెట్ ఉండదు. కానీ, ఒకవేళ. అనే అంశాలు చాలా ఉన్నాయి. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో ఏ క్రీడాపోటీలు జరగవని అనుకుంటున్నా”ననని గంగూలీ అన్నారు.
మరోవైపు కరోనాకి వాక్సీన్ వచ్చే వరకు క్రికెట్ మ్యాచ్ లు జరగకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.