స్విగ్గీలో భారీగా ఉద్యోగుల తొలగింపు

కరోనా ఎఫెక్ట్ తో ఉద్యోగాలు ఊడుతున్నాయి. సాఫ్ వేర్ ఉద్యోగాల్లో కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగాలు పోతున్నాయి. ప్రయివేటు పరిశ్రమల్లో ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రాబోయే నెలలో 800-900 ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించనుంది. ఈ మేరకు కాస్ట్ కటింగ్ ప్లాన్ లో భాగంగా బోర్డు ప్రతిపాదించిన నిర్ణయాన్ని కంపెనీ ఆమెదించింది.

తెలంగాణలో కరోనా లాక్ డౌన్ కొనసాగినా ఆన్ లైన్ ఫుడ్ డెలవరీకి సడలింపు ఉండేది. అయితే ఈ నెల 20 నుంచి వాటిన్ బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి..  ఫిబ్రవరి-మార్చి నెలలోనే స్విగ్గీ ఉద్యోగులను తొలగించాలనుకుంది. ఆ తర్వాత ఆ నిర్ణయం వెనక్కు తీసుకుంది. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో ఉద్యోగులని తొలగించడం తప్పడం లేదు. ఇక పేటీఎం ఇప్పటికే 700మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.