గ్రేట్ : తెలుగు రాష్ట్రాలకి విజయ్ సాయం

తమిళ్ స్టార్ హీరో విజయ్ కి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుంటుంది. మంచి కలెక్షన్స్ సాధిస్తుంటుంది. విజయ్ కూడా తెలుగు ప్రజలు అంటే ప్రత్యేక అభిమానం. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా తెలుగు రాష్ట్రాలకి కరోనా సాయం అందించారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, స్వరాష్ట్రం తమిళనాడుకు రూ.50 లక్షల విరాళం అందించారు విజయ్. ఇక ప్రధాని సహాయనిధికి వీజయ్ రూ.25 లక్షలు, దక్షిణ భారత నటుల సంఘానికి(FEFSI) రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు విజయ్. మొత్తంగా.. విజయ్ 1.3 కోట్లను విరాళంగా ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకుడు.