ఏపీ సర్కార్ ‘సున్నా వడ్డీ’ పథకం

పొదుపు సంఘాలకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పొదుపు సంఘాలు చెల్లించాల్సిన మొత్తం వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ పీరియడ్‌లో పొదుపు సంఘాలు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వం చెల్లించనుంది. ఇందుకోసం ‘వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం’ ప్రారంభించనున్నారు. ఈ నెల 24న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు.

ఈ తాజా నిర్ణయంతో జీవనోపాధికి తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించలేని పొదుపు సంఘాలకు ఎంతో ఊరట లభించనున్నది. తాజా లెక్కల ప్రకారం వడ్డీ భారం 1400 కోట్ల రూపాయలుండగా.. దాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది. అధికారంలోకి రాగానే సున్నావడ్డీకి రుణాలు ఇప్పిస్తామని జగన్ గతంలోనే హామీ ఇచ్చారు. ఇప్పుడీ ఈ హామీని కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన అమలు చేయబోతున్నారు.