ఇంట్లో చిరు పనులు.. వీడియో !

టాలీవుడ్ లో ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండ్ గా మారింది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఈ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన మగవారు మహిళలకి సాయం చేయాలి. ఇంటి పనులు చేయాలి. మంచి మనుషులు అనిపించుకోవాలి. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియోలో షేర్ చేయాలని సందీప్ కోరారు.

ఇప్పటికే ఈ చాలెంజ్‌ను సినీ ప్రముఖులు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, కొరటాల శివ, సుకుమార్‌, ఎంఎం కీరవాణి విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా టాస్క్ ని పూర్తి చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన చిరు.. ఇంట్లో పనులు చేశారు. ఇంటిని శుభ్రం చేశాడు. అమ్మ కోసం దేశ వేశాడు. దానికి సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. “భీమ్‌(తారక్‌) ఇదిగో చూడు.. నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం. ఈ వీడియో సాక్ష్యం’ అని చిరు పేర్కొన్నారు.

ఇక ఈ ఛాలెంజ్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్, మంత్రి కేటీఆర్ ని నామినేట్ చేశారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. కాజల్ హీరోయిన్. ఈ సినిమా తర్వాత లూసిఫర్ రిమేక్ లో చిరు నటించనున్నారు. ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. యువ దర్శకులు బాబీ, మెహర్ రమేష్ చెప్పిన కథలని కూడా చిరు ఓకే చేశారు.