రోల్ రైడా కరోనా సాంగ్’లో కేసీఆర్ డైలాగ్స్

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. కరోనాపై వీడియో మెసేజ్ లు ఇస్తున్నారు. పాటలు పాడుతున్నారు. వీటిలో కొన్ని వైరల్ అవుతున్నాయి. ప్రజలని ఆలోచింపజేస్తున్నాయి. తాజాగా  తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 2 కంటెస్ట్‌లు కలిసి ఓ వీడియోను తయారు చేశారు. ‘బోర్‌ కొడుతోంది’ అంటూ తెలుగు ర్యాపర్‌ రోల్‌రైడా రచించి స్వరపరిచిన పాట నెట్టింట ఆకట్టుకుంటోంది. 

దీనికి యువ కథానాయకుడు తనిష్‌ దర్శకత్వం వహించారు. ఈ వీడియోలో ‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌లు గీతా మాధురి, నందిని రాయ్‌, భాను శ్రీ, శ్యామల, దీప్తి నల్లమోతు, దీప్తి సునయన, పూజా రామచంద్రన్‌, సంజన, తనీష్‌, అమిత్‌ తివారీ, సామ్రాట్‌, గణేశ్‌, కిరిటీలు పాట పాడుతూ అలరించారు. అయితే ఈ సాంగ్ లో సీఎం కేసీఆర్ డైలాగ్స్ వాడుకున్నారు. అవి ఈ పాటకే హైలైట్ గా నిలిచాయి.