తెలంగాణ ఎంసెట్ జూన్ లో !

కరోనా లాక్‌డౌన్ కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పరీక్షలు నిలిచిపోయాయ్. ఒక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు మాత్రమే పూర్తయ్యాయి. పదో తరగతి పరీక్షలు మధ్యలోనే నిలిచిపోయాయ్. ఢిగ్రీ, పీజీ, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అవి ఎప్పుడు నిర్వహిస్తారు ? అనే విషయంలో క్లారిటీ లేదు. 

 లాక్‌డౌన్ ‌ను మే నెలాఖరు వరకు పొడిగిస్తే ఎంసెట్‌, ఈసెట్‌ వంటి ప్రవేశ పరీక్షలను జూన్‌ మూడు లేదా నాలుగోవారానికి వాయిదావేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. డిగ్రీలో డిటెన్షన్‌ విధానాన్ని రద్దుచేస్తూ వర్సిటీలకు ఆదేశాలు జారీచేశామని మీడియాకు వెల్లడించా రు. డిగ్రీ, పీజీ తదితర కోర్సులను ఆన్‌లైన్‌లో అందించడానికి మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చిందని చెప్పారు.