తెలంగాణలో కరోనా కేసులు లెటెస్ట్ అప్ డేట్
తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతోంది. మునుపటిలా కాకుండా రోజువారీగా నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
గురువారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500కుపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 13మందికి పాజిటివ్ గా తేలిందని మంత్రి ఈటెల తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 983కి చేరింది. బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్ పై ఉన్నారని ఈటల తెలిపారు. కరోనా నుంచి కోలుకొని శుక్రవారం 29 మంది డిశ్చార్జ్ అయ్యారు.