లాక్ డౌన్ మరో రెండు నెలలు పొడగిస్తారా ?

దేశంలో కరోనా కట్టడి కోసం ముందుగా 21 రోజుల (ఏప్రిల్ 14) పాటు లాక్ డౌన్ ని విధించింది కేంద్రం ప్రభుత్వం. ఆ తర్వాత దానికి మే 3 వరకు పొడగించింది. ఇక తెలంగాణలో మరో నాలుగు రోజులు అదనంగా అంటే.. మే 7వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే ఆ తర్వాతనైనా లాక్ డౌన్ ఎంతేస్తారా ? అంటే కష్టమే అంటున్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న ట్రండ్‌ని ఫాలో అవుతున్న వారు మాత్రం లాక్ డౌన్ కనీసం ఇంకో రెండు నెలలు కొనసాగక తప్పదంటున్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా విజృంభిస్తోంది. ముంబైలోని ధారవి వంటి స్లమ్‌ ఏరియాలో ఇప్పటికే 200మందికి పైగా కరోనా సోకింది. మే నెలాఖరికల్లా ఆ సంఖ్య 70వేలకి చేరవచ్చని ఓ సర్వేలో తేలింది. ముంబై ఒక్కటే కాదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మే 3 తర్వాత గ్రీన్ జోన్లలో సడలింపులు ఇచ్చినా.. రెడ్, ఆరేంజ్ లలో మాత్రం మరో ఒకట్రెండు నెలలు లాక్ డౌన్ కొనసాగిస్తారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.