‘రామరాజు ఫర్ భీమ్’ సమస్య అదే !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ వచ్చేసింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్స్ చరణ్ యాక్షన్ తో వచ్చిన భీమ్ ఫర్ రామరాజు అదిరిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ ని ఏంటన్నది చూపించేసింది. ఇక ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ని రెడీ చేయడం కష్టంగా మారింది. ఈ టీజర్ రావడం అనుమానమేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి అన్నారు. తాజాగా రామరాజు ఫర్ భీమ్ కు గల అసలు సమస్యని వివరించారు. అల్లూరి వాయిస్ ఓవర్ ఇవ్వడం సమస్య కాదు. కానీ, ఇంకా భీమ్ కి సంబంధించి కొన్ని విజువల్స్ ని షూట్ చేయాల్సి ఉంది. లాక్ డౌన్ తర్వాత ఎలాంటి అనుమతులు వస్తాయనేది చూసి చిత్రీకరణ చేయాలని జక్కన్న తెలిపారు.