మళ్లీ కంసాలిగా మారిన సంపూ

సామాన్యుడు స్టార్ గా మారిన వారిలో మన సంపూర్ణేష్ బాబు ఒకరు. అయితే కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సెలబ్రిటీ, సామాన్యుడు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటికే పరిమితమైన మగవారు మహిళలకి సాయం చేయాలి. ఇంటి పనులు చేయాలి. మంచి మనిషి అనిపించుకోవాలని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా #BetheREALMAN ఛాలెంజ్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఛాలెంజ్ టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది.

ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్ తదితరులు #BetheREALMAN ఛాలెంజ్ ని పూర్తి చేశారు. తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు కూడా ఈ ఛాలెంజ్ ని పూర్తి చేశారు. మళ్లీ కంసాలిగా మారి పిల్లల కోసం కాలి గజ్జెలు చేశారు. దానికి సంబంధించిన వీడియోని సంపూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

రాజు పేద తేడా లేదు…
నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు..
నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు గుర్తు చేసుకుంటున్న సమయం ఇది…
మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను

#BetheREALMAN

సదా మీ ప్రేమకి బానిస
మీ సంపూర్ణేష్ బాబు