కరోనాపై ట్రంప్ ప్రమాదకరమైన సలహా
మహమ్మారి కరోనా కట్టడి విషయంలో అలసత్వం వహించారని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిపై విమర్శలొస్తున్నాయ్. ఇలాంటి టైంలో కరోనా కట్టడి కోసం ప్రమాదకరమైన సలహాలు ఇచ్చి.. మరింత అభాసు పాలవుతున్నారు ట్రంప్. కరోనా వైరస్‌ను చంపేందుకు డిసిన్‌ఫెక్టంట్స్‌ను ఇవ్వడం, శరీరంలోకి అతినీల లోహిత కిరణాలను పంపించడం సాధ్యమవుతుందేమో అధ్యయనం చేయాలని ట్రంప్ సూచించారు.
ట్రంప్ సలహాపై వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఇచ్చిన ప్రమాదకరమైన సలహా పాటించొద్దని ప్రజలకి సూచించారు. ‘ప్రజలు చచ్చిపోతారని నా భయం. ట్రంప్ సలహా బాగుందని వారు భావించగలరు. ఇది పనిచేస్తుందేమో అనుకోగలరు. కానీ అది అత్యంత ప్రమాదకరం’ అని న్యూయార్క్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ క్రెయిగ్ స్పెన్సర్ అన్నారు.