విజయ్ లాక్‌డౌన్ వీడియో.. అదిరింది !
టాలీవుడ్ లో ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండ్ గా మారింది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఈ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు. కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమిమైన మగవారు ఆడవాళ్లకి సాయం చేయాలి. ఇంటి పనులు చేయాలి. మంచి మనుషి అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు సందీప్. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ని రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్, కొరటాల శివ తదితరులు పూర్తి చేశారు.
దర్శకుడు కొరటాల ఈ ఛాలెంజ్ కోసం టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండని నామినేట్ చేశారు. అయితే మా అమ్మ ఇంట్లో ఏ పని చేయనీయడం లేదు. నేను చేస్తే పని డబుల్ అవుతుందట. ఇంకా చిన్న పిల్లలుగానే చూస్తోంది. రియల్ మ్యాన్ గా చూడటం లేదని విజయ్ తెలిపారు. అయితే లాక్‌డౌన్ సమయంలో తన డే ఎలా గడుస్తుంది తెలుపుతూ ఓ వీడియో షేర్ చేస్తానని తెలిపారు విజయ్.
తాజాగా ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో తన దైనందిన కార్యక్రమాలని చూపించాడు. దాదాపు 9 గంటలు పడుకుంటున్న విజయ్ లేవగానే వైన్ బాటిల్స్ ని వాటర్ బాటిల్స్‌గా ఉపయోగిస్తూ అందులో నీటిని నింపి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆ తర్వాత లీటర్ నీటిని తాగాడు. పాత కవర్స్‌ని డస్ట్ కవర్స్‌గా ఉపయోగించాలని వీడియోలో పేర్కొన్నాడు. ఆ తర్వాత మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసి తన కుటుంబ సభ్యులకి అందించాడు. టీవీ తుడిచి గేమ్ ఆడాడు. ఇది తన లాక్‌డౌన్‌లో నడుస్తున్న ప్రక్రియ అని వీడియో ద్వారా తెలిపాడు. సంక్షోభం సమయంలో మనం మనతోటి వారికి అండగా నిలుద్ధాం అని పేర్కొన్నాడు. ఇక ఈ ఛాలెంజ్ కోసం విజయ్ దుల్కర్ సల్మాన్ ని నామినేట్ చేశాడు.
Bits of my day in lockdown 🙂
Documented by @ananddeverkonda#BeARealMan challenged by @sivakoratala sir. I would like to extend it to Kunjikkaa @dulQuer pic.twitter.com/8bLAAQYeMo— Vijay Deverakonda (@TheDeverakonda) April 25, 2020