ఘనంగా గులాబీ జెండా పుట్టినరోజు పండగ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనే లక్ష్యంగా పుట్టిన గులాబీ జెండా 20వ పుట్టినరోజు నేడు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవీర్భావ దినోత్సవం నేడు. ఈ పండగనే తెరాస శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. కరోనా ఎఫెక్ట్ లోనూ సామాజిక దూరాన్ని పాటిస్తూ.. గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న ప్రేమని చాటుకుంటున్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రతి ఇంటిపైనా గులాబీ జెండాని ఎగరవేస్తున్నారు. రక్తదానాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెరాస భవన్ లో పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఇక ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్స్ తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన గులాబీ జెండాపై మరింత ప్రేమ కలిగేలా ఉన్నాయి.
“తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా
గుండె గుండెను ఒకటి చేసిన జెండా
ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా పేదవాడి ఆకలి తీర్చిన జెండా
రైతన్నకు భరోసా ఇచ్చిన జెండా
తెలంగాణా ప్రజలకు అండా దండా మన గులాబీ జెండా
మన గులాబీ జెండా పుట్టినరోజు పండగ, ప్రతి గులాబీ సైనికుడికి దండాలు.
జై తెలంగాణ”
“ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు
ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది
స్పూర్తి ప్రదాతా వందనం …ఉద్యమ సూర్యుడా వందనం
20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ
ఆవిర్భావ దినోత్సావ శుభాకాంక్షలు
జై తెలంగాణా ! జై జై KCR !!” అంటూ వరుస ట్విట్స్ చేశారు మంత్రి కేటీఆర్.