మనవరాలితో కలిసి చిరు సరదాగా.. !
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఎంట్రీతో మెగా అభిమానులకి బూస్ట్ లభించింది. సోషల్ మీడియా వేదికగా చిరు బాధ్యతని గుర్తు చేస్తున్నారు. అనుభవాన్ని పంచుతున్నారు. ఎంటర్ టైన్ చేస్తున్నారు. “సాధారణంగా సాంగ్స్ షూట్ చేస్తున్న సమయంలో వాటిని ఆసాంతం వినేందుకు ఇష్టపడతా. మధ్యలో బ్రేక్‌లు వస్తే నాకు ఇష్టం ఉండదు. కానీ, ఇటీవల పాటను మధ్యలో ఆపి ఆపి వినడం భలే సరదాగా అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో మంగళవారం ఉదయం చెబుతా” అని చిరు నిన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
దానికి గల కారణాన్ని తెలుపుతూ.. ఈరోజు సరదా వీడియోని షేర్ చేశారు చిరు. “సంగీతానికి ఉండే శక్తిని చూస్తే నిజంగా అద్భుతం. ఏడాది వయసున్న ఈ చిన్నారిని చూడండి మ్యూజిక్‌ను ఎలా ఎంజాయ్ చేస్తోందో.. అంతేకాదు, పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడం సరదాగా ఉంది. పాజ్ అండ్ ప్లే మ్యూజిక్ చూడటం ఇప్పుడు భలేగా ఉంది. పాట నాది కాబట్టి, అమ్మమ్మ సురేఖ క్రెడిట్ కూడా నాకే” అంటూ తన మనవరాలితో కలిసి చిరు సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Always amazed @ the power of music.Just over 1 yr & how this little kid enjoyed music & tried doing dance moves is sheer bliss.Paused & played music 2 see she was really loving it.పాట నాది కాబట్టి,అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే😄 #PreLockdownMoments #Throwbackvideo #navishka_k pic.twitter.com/znNOyMY0MB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 28, 2020