హిందీలో ‘ఇస్మార్ట్ శంకర్’ రికార్డు

అసలు సిసలు మాస్ హిట్ అంటే ఎలా ఉంటుందో ‘ఇస్మార్ట్ శంకర్’తో చూపించాడు దర్శకుడు పూరి. ఆయన దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. గత యేడాది జులై 18 రిలీజైన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమా హిందీలోనూ హవా చూపిస్తోంది. ఇటీవల ఈ సినిమాని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.

యూట్యూబ్ లో హిందీ ఇస్మార్ట్ శంకర్ 24 గంటలు గడవక ముందే 11 మిలియన్ వ్యూస్ సంపాదించింది. తాజాగా ఈ చిత్రం హిందీలో వంద మిలియన్ వ్యూస్‌ని సంపాదించి రికార్డుల వేట దిశగా కొనసాగుతుంది. ఓ డబ్బింగ్ చిత్రానికి ఇంత భారీ స్థాయిలో ఆదరణ రావడం విశేషం అని చెప్పవచ్చు. మరోవైపు ఇస్మార్ట్ శంకర్ బాలీవుడ్ రిమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ఇస్మార్ట్ శంకర్ గా స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కనిపిస్తారని చెబుతున్నారు.