సింపుల్’గా బిగ్ బాస్ విజేత పెళ్లి

కరోనా ఎఫెక్ట్ పెళ్లిళ్లపై పడింది. కరోనా ప్రభావంతో సామాన్యులు, సెలబ్రిటీలు కూడా పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ ల పెళ్లిళ్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం తగ్గేదాక ఆగలేని కొందరు మాత్రం చాలా సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ హిందీ సీజన్‌2 విజేత అశుతోష్ కౌశిక్ ఇంటి టెర్రస్ పై చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. అలీఘర్‌కి చెందిన అర్పితని పెళ్లాడాడు.

వీరి వివాదం ఆదివారం జరిగింది. ముందుగానే నిర్ణయించిన ముహూర్తం కావడంతో.. ఇంటి టెర్రస్ పై చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు అశుతోష్ కౌశిక్. ఈ పెళ్లికి పురోహితుడితో పాటు వరుడి తల్లి, సోదరి, వధువు తల్లి, సోదరుడు హాజరయ్యారు. తన పెళ్లికి సంబంధించిన వీడియోని అశుతోష్ తన ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేస్తూ.. నిరాడంబరంగా చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బులని పీఎం కేర్స్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.