అల్లు అర్జున్’ని ఛాలెంజ్ చేసిన దేవిశ్రీ
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి ఛాలెంజ్ విసిరాడు. మంచి మనిషి అని నిరూపించుకోవాలని కోరాడు. టాలీవుడ్ లో ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్ది దర్శకుడు సందీప్ వంగా ఈ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు.
కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమైన మగవారు ఆడవాళ్లకి సాయం చేయాలి. ఇంటి పనులు చేయాలి. మంచి మనిషి అనిపించుకోవాలని సందీప్ వంగా కోరారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ని రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, క్రిష్, కీరవాణి, సుకుమార్, విజయ్ దేవరకొండ తదితరులు పూర్తి చేశారు. సుకుమార్ నుంచి ఈ ఛాలెంజ్ ని అందుకున్న దేవిశ్రీ ప్రసాద్.. తాజాగా టాస్క్ ని పూర్తి చేశాడు.
ఇల్లు ఊడిచి, తూడిచి.. ఎగ్ ఆమ్లేట్ వేసి తల్లికి అందజేశాడు. ఆ తర్వాత స్నానం చేసొచ్చి నాన్నకి దండం పెట్టుకున్నారు. దేవి ‘బి ది రియల్ మ్యాన్’ వీడియో భిన్నంగా ఉంది. ఇందులో ఆయన అల్లుడు కూడా అనిపించారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ని పూర్తి చేసినవారి బిట్ సీన్స్ ని వేశారు. ఇక ఛాలెంజ్ కోసం దేవిశ్రీ అల్లు అర్జున్, కార్తీ, యశ్, హరీష్ శంకర్ లని నామినేట్ చేశారు. దేవిశ్రీ ఇంటిపనుల వీడియోని మీరు చూసేయండీ.. !
Here’s my #betheREALMAN video Dear SUKU BHAI @aryasukku
Wit an Entertaining Effort
@imvangasandeep @ssrajamouli @KChiruTweets
Nw I request My Dear Friends@alluarjun @Karthi_Offl @TheNameIsYash @harish2you
&
Our Lalettan
Dear @Mohanlal sir
2 take d Challnge Forwdpic.twitter.com/6CnIgFy6P8
— DEVI SRI PRASAD (@ThisIsDSP) April 29, 2020