ఇర్పాన్ చివరి మాట ఏంటో తెలుసా ?
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మృతి చెందారు. ఇర్పాన్ తల్లి సయీదా బేగం (95) చనిపోయిన ఐదు రోజులకు ఇర్ఫాన్ కూడా కన్నుమూయడం బాధాకరం. ఆమె శనివారం జైపూర్ లో తుదిశ్వాస విడిచారు. లాక్ డౌన్ వల్ల ఇర్ఫాన్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు.
నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది అని తుదిశ్వాస విడవడానికి ముందు ఇర్పాన్ అన్నారట. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియల్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఇర్పాన్ దాదాపు 100 సినిమాల్లో నటించారు. తెలుగులో సైనికుడు చిత్రంలో నటించి మెప్పించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం అంగ్రేజీ మీడియం. మార్చి 20న అంగ్రేజీ మీడియం ప్రేక్షకుల ముందుకొచ్చింది.