శ్రియ అందాల విందు


కరోనా లాక్‌డౌన్ తో సినీతారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాల్లోనూ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. పర్సనల్, సినిమాలకి సంబంధించిన ఆసక్తికర విషయాలని పంచుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇంట్లోనే ఫోటో షూట్స్ చేసి.. వాటిని అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు. ఇటీవల శోభిత ధూళిపాళ్ల క్వారంటైన్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలని షేర్ చేసింది. 

తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రియా హాట్ హాట్ ఫోటోలని షేర్ చేసింది. ఎద అందాలని ఎరగవేసి తీసిన ఫోటోలతో తనలో ఏమాత్రం అందాలు తగ్గలేదు అన్నట్టుగా ఫోజులిచ్చింది. ఇలాంటి పనులకి ఆమె భర్త నుంచి పూర్తి సహకారం ఉన్నట్టుంది. ఇటీవల ఆన్ లైన్ చాటింగ్ లో శ్రియాపై ఓ నెటిజన్ భయంకరమైన కామెంట్ చేశాడు. అతడికి శ్రియా భర్త సపోర్ట్ చేయడం షాక్ కి గురి చేసింది.