పెరిగిన కరోనా రికవరీ రేటు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 33,050కి చేరింది. 1074 మంది మృతి చెందారు. అయితే కరోనా రికవరీ రేటు పెరగడం గుడ్ న్యూస్ అని చెప్పాలి. 14 రోజుల క్రితం రికవరీ రేటు 13 శాతం ఉండగా తాజాగా గురువారం నాటికి అది 25 శాతానికి పైగా పెరిగింది.
ఇక కరోనా హాట్ స్పాట్ జిల్లాల సంఖ్య 170 నుంచి 129 కి తగ్గింది. ఇన్ఫెక్షన్ ఫ్రీ జిల్లాలు లేదా గ్రీన్ జోన్లుగా వర్గీకరించిన జిల్లాల్లో లాక్ డౌన్ పాక్షిక సడలింపుల కారణంగా మళ్ళీ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో మే 3 తర్వాత రెడ్ జోన్లలో లాక్ డౌన్ పొడగించవచ్చు. గ్రీన్ జోన్లలో మాత్రం సడలింపులు ఇవ్వొచ్చని చెబుతున్నారు. రెడ్ జోన్లని గ్రీన్ జోన్లుగా మార్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ గా పెట్టుకున్నాయి.