బుట్టబొమ్మ పాటకు వార్నర్ స్టెప్పులు

త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అల.. సూపర్ హిట్ అయింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక అల.. పాటలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి.

అల.. పాటలకి బాలీవుడ్ సెలబ్రిటీలు సెప్టులేయడం చూశాం. ఇటీవల ఫిలిప్పీన్స్‌లో కొందరు సినీ లవర్స్ బుట్టబొమ్మ సాంగ్‌కి గ్రూప్ డ్యాన్స్ చేశారు. శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయడం మనం చూశాం. తాజాగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భార్యతో కలిసి బుట్టబొమ్మ సాంగ్ కి స్టెప్పులేశాడు. మధ్యలో ఆయన కూతురు కూడా జాయిన్ అయింది. దీనికి సంబంధించిన వీడియోని వార్నర్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.