ఉద్యోగులకి రిలయన్స్ షాక్

కరోనా లాక్ డౌన్ తో పలు కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నారు. 10 శాతం నుంచి 50 శాతం వరకు కోతని విధిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వేతన కోతల బాటలో నడుస్తోంది. ఆయిల్ అండ్ గ్యాస్ డివిజన్‌లోని ఉద్యోగుల వేతానాల్లో 50 శాతం వరకు కోతలు విధించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
కరోనా ఎఫెక్ట్ తో అతి తక్కువ ఇంధన వినియోగం, లాభదాయకతతో పోరాడుతున్న నేపథ్యంలో వేతనాల్లో కోతలు విధించాలని నిర్ణయించినట్టు ఆరు వర్గాలు వెల్లడించినట్టు రాయిటర్స్ తెలిపింది. ఏడాదికి 1.5 మిలియన్ రూపాయలు ఆర్జించిపెట్టే ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వేతనాల్లో 30-50 శాతం కోత ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.